News March 11, 2025

సిద్దిపేట: సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. మొత్తం 54 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 5, 2026

పెద్దపల్లి జిల్లాలో 96% హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏడవ రోజు ప్రశాంతంగా పూర్తయ్యాయని ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. మ్యాథమెటిక్స్, ఐబి, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలు గురువారం జరిగాయి. 4306 మంది విద్యార్థులకు గాను 4176 మంది హాజరయ్యారు. 130 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. హాజరు శాతం 96గా నమోదు అయ్యింది. పరీక్షలు సక్రమంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగాయని ఆమె వెల్లడించారు.

News March 5, 2026

SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు

image

శ్రీకాకుళం నగరంలో మార్చి 8న కోడి రామ్మూర్తి స్టేడియంలో ‘అస్మిత’ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. 13-18 ఏళ్లున్న వారు అర్హులన్నారు. https://nsrs.kheloindia.gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News March 5, 2026

ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

image

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.