News March 12, 2025
సిద్దిపేట: సమాజంలో మహిళల పాత్ర కీలకం: సీపీ

సమాజ నిర్మాణంలో మహిళలే కీలకమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణ త్రీ టౌన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలు అని రంగాల్లో రానిస్తున్నారని అన్నారు.
Similar News
News October 26, 2025
గుంటూరులో ప్రమాదం.. తెగిపడిన కాలు..!

పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో ప్రమాదం జరిగింది. కొరిటెపాడు ప్రాంతానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.
News October 26, 2025
సంగారెడ్డి: యువకుడిపై ఫోక్స్ కేసు నమోదు

కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన కస్ప సంతోష్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కంగ్టి సీఐ వెంకటరెడ్డి శనివారం తెలిపారు. రెండు నెలల క్రితం కల్హేర్‌లో అతని మేన మామ వద్ద ఉంటూ ఓ బాలికను ఎత్తుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.


