News February 9, 2025
సిద్దిపేట: సర్వే అన్నింటికీ ఉపయోగం: మంత్రి పొన్నం

బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణనలో ఏ తప్పు లేదని, ఏదైనా తప్పు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సబ్ ప్లాన్ పథకాల రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు. బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొనరు.. అవహేళన చేస్తారని మండిపడ్డారు.
Similar News
News March 24, 2025
HNK: గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ చేసిన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 4న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా సూచించారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.
News March 24, 2025
వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.
News March 24, 2025
సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?

TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు వచ్చారని, ఈ మేరకు నేడు CMతో జరిగే సమీక్షలో వెల్లడించనున్నట్లు సమాచారం. బురద వల్ల మృతదేహాలు కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, 8మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన విషయం తెలిసిందే. మరోవైపు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.