News February 7, 2025
సిద్దిపేట: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: DMHO

ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట డీఏంహెచ్ఓ పాల్వన్ కుమార్ సూచించారు. గురువారం జిల్లాలోని జగదేవ్ పూర్, తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్లలో నిర్వహిస్తున్న పరీక్ష నమూనాలను పరిశీలించారు.
Similar News
News December 2, 2025
NTR: ఏం పంపిస్తున్నారో.. అసలు చూస్తున్నారా..?

విజయవాడ డివిజన్ పరిధిలో RTC కార్గో సర్వీసుల ద్వారా ఏటా రూ.120 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అయితే తనిఖీలు మాత్రం ప్రశ్నార్ధకంగా మారాయి. నిఘా లేకపోవడంతో కొందరు డ్రగ్స్ను దర్జాగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల బస్సులు పార్సిల్స్ కోసం 45 నిమిషాలు ఆగుతున్నా, సరకుల పరిశీలన లేదు. పేలుడు పదార్థాలు రవాణా అయినా గుర్తించే వీలు లేకపోవడం ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారిందంటున్నారు.
News December 2, 2025
APPLY NOW: IIBFలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్(IIBF) 10 Jr ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA ఉత్తీర్ణులు అర్హులు. గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.iibf.org.in
News December 2, 2025
NGKL: రెండో రోజు దాఖలైన నామినేషన్ వివరాలు!

NGKL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు మొత్తం 280 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 72 నామినేషన్లు వచ్చాయి. కొల్లాపూర్ (39), కోడేరు (37), నాగర్కర్నూల్ (45), తిమ్మాజీపేట (48), బిజినపల్లి (22), పెంట్లవెల్లి (17) నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 151 గ్రామాలకు గాను 458 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.


