News June 29, 2024
సిద్దిపేట: ‘సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి’

సీజనల్ వ్యాధుల వల్ల ప్రబలే అంటూ వ్యాధులపైన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని DMHO డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. వర్గల్ UPHCని ఆకస్మిక సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జ్వర పీడితులకు తక్షణమే రక్త నమూనాలు సేకరించి చికిత్స అందించాలని, అవసరం ఉన్న సమయంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News October 30, 2025
మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.
News October 30, 2025
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఐఈవో

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) మాధవి ఆదేశించారు. బుధవారం ఆమె జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన మాధవి, విద్యార్థులతో మాట్లాడి సబ్జెక్టుల వివరాలు అడిగారు. ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు శ్రద్ధ చూపాలని దిశానిర్దేశం చేశారు.
News October 30, 2025
నూతన క్వారీలకు అనుమతి తప్పనిసరి: మెదక్ కలెక్టర్

మెదక్ జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్, నూతన క్వారీల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ(సీయా) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లా సర్వే నివేదికను రూపొందించినట్లు తెలిపారు.


