News April 14, 2025
సిద్దిపేట: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దు: సీపీ

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హెచ్చరించారు. IT చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు SMలో తప్పుడు పోస్టులు పెట్టవద్దన్నారు.
Similar News
News April 12, 2026
MHBD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శనివారం జరిగింది. మట్వాడ శివారు నీలవంచకు చెందిన చిన్నారులు శ్రీజ(9), చైత్ర(9) చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
News April 12, 2026
MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News April 12, 2026
సింహాచలం: రేపటి నుంచి చందనోత్సవం టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

ఏప్రిల్ 20న జరగనున్న సింహాచలం చందనోత్సవం టికెట్లను ఏప్రిల్ 13 నుంచి 17వరకు విక్రయించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.300,రూ.1000, దర్శన టికెట్లు అక్కయ్యపాలెం, సింహాచలం యూనియన్ బ్యాంక్, సింహాచలం, బిర్లా జంక్షన్ శాఖ ఎఅమ్మనున్నారు. https://chandanotsavam.ap.gov.in ద్వారా రూ. 300,రూ.1000 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.


