News April 10, 2025
సిద్దిపేట: స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయాలి: కలెక్టర్

గురుకులాల్లో కొత్త డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం హబ్సిపూర్ మహాత్మ జ్యోతిబాపూలే, తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. స్టోర్ గదిని పరిశీలించి నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని సూచించారు. ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News October 24, 2025
జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలుసా?

సుప్రీంకోర్టు తదుపరి <<18083662>>సీజేఐ<<>> రేసులో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 1962లో హరియాణాలోని హిసార్‌లో జన్మించారు. 1984లో లా డిగ్రీ అందుకున్న ఆయన 2000లో హరియాణా AGగా, 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్‌ప్రదేశ్ HC ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. ఒకవేళ ఆయన CJI నియమితులైతే నవంబర్ 24న బాధ్యతలు చేపట్టి 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు.
News October 24, 2025
ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
News October 24, 2025
NRPT: విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు: కలెక్టర్

నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడంపై నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 14న జిల్లా స్థాయిలో స్పెల్ బీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.