News February 3, 2025
సిద్దిపేట: స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటిన కమిషనరేట్ సిబ్బంది

రాష్ట్రస్థాయి కరాటేలో గోల్డ్ మెడల్, పవర్ లిఫ్టింగ్లో సిల్వర్, బాడీ బిల్డింగ్లో సిల్వర్, టెన్నిస్లో కాంస్య పతకాలు సాధించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అనురాధ అభినందించారు. కరీంనగర్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో రాజన్న సిరిసిల్ల జోన్ తరుపున సిద్దిపేట కమిషనరేట్ సిబ్బంది, అధికారులు సత్తా చాటారు.
Similar News
News November 26, 2025
BNGR: అద్భుతమైన ప్రదేశం.. మీరు వెళ్లారా..

సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ శివాలయ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు, సందర్శకులు ఇక్కడికి వస్తుండటంతో పర్యాటక అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ తగిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు, నాయకులు కోరుతున్నారు.
News November 26, 2025
రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి ఒంటిమిట్ట, సిద్దవటం

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.