News February 22, 2025
సిద్దిపేట: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

సిద్దిపేటలో వ్యక్తి <<15521843 >>హత్య కేసు<<>>ను పోలీసులు చేధించారు. హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ACP మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు.
Similar News
News November 20, 2025
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. 2.03 కోట్లు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 27 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రూ. 2 కోట్ల 3 లక్షల 25 వేల 676 వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. హుండీ ద్వారా 228 గ్రాముల బంగారం, 14 కిలోల 300 గ్రాముల వెండి సమకూరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది, ఎస్ఎఫ్ఐ, హోంగార్డుల పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది.
News November 20, 2025
బోర్డులను “బ్రోకర్ల డెన్”లుగా మార్చారు: సంజయ్

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.
News November 20, 2025
రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్ చేశారు. బాధితులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


