News February 26, 2025
సిద్దిపేట: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో మంగళవారం జరిగింది. సిద్దిపేట కోహెడ మండలం వరికోలుకు చెందిన అనూష భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈనెల 14న నిశ్చితార్థం కాగా మార్చి 6న పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో అనూష అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Similar News
News December 4, 2025
ASF: పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

స్థానిక సంస్థల ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలన్నారు.
News December 4, 2025
ఖమ్మం: ఆహార శుద్ధి రంగంలో నిపుణుల కొరతపై ప్రశ్నించిన ఎంపీ

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఖమ్మం ఎంపీ రఘునాథరెడ్డి ప్రశ్నించారు. కేవలం మూడు శాతం కార్మికులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతిక వినియోగ వివరాలు తెలపాలని లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్ నిత్ సింగ్ బిట్టు లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
సర్వర్ మొరాయింపుతో కౌశలం స్కిల్ టెస్టుకు అడ్డంకి.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా నిర్వహిస్తున్న కౌశలం (కౌన్సిలింగ్) సర్వేకు సంబంధించిన ఆన్లైన్ స్కిల్ టెస్ట్ ప్రక్రియ సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర అంతరాయానికి గురైంది. జిల్లాలోని పలు సచివాలయ కేంద్రాలలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష కోసం హాజరైన అభ్యర్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.


