News February 9, 2025

సిద్దిపేట: 10 రోజుల వ్యవధిలోనే నలుగురి మృతి

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో <<15400876>>పది రోజుల క్రితం<<>> జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేటకు చెందిన భార్యాభర్తలు ఆకుల కనకయ్య, తార మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో వారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ తీవ్ర గాయాలతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 12 రోజుల వ్యవధిలో ఓ వైపు తండ్రి, అత్తామామ, భర్త మృతితో సృజన రోదనలు మిన్నంటాయి. వారి మరణంతో బంధువులు శోకసముద్రంలో మునిగారు.

Similar News

News November 25, 2025

జగన్నాథపురంలో శాటిలైట్ రైల్వే స్టేషన్?

image

విశాఖ రైల్వే స్టేషన్‌ మీద ట్రాఫిక్‌ భారం తగ్గించేందుకు రైల్వే శాఖ సబ్బవరం సమీపంలోని జగన్నాథపురం వద్ద కొత్త శాటిలైట్ స్టేషన్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. కొత్తవలస–అనకాపల్లి మధ్య 35 కిమీ బైపాస్ లైన్ ప్రాజెక్టులో భాగంగా.. 563 హెక్టార్లు విస్తీర్ణంలో రూ.2,886.74 కోట్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేషన్‌లో 15 ఫ్రైట్ ఎగ్జామినేషన్ లైన్లు, 5 కోచింగ్, 11 స్టాబ్లింగ్ లైన్లు ఉండనున్నట్లు సమాచారం.

News November 25, 2025

నంద్యాల: అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

image

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌కు ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని ఇమాన్యుల్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని కాశమ్మ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా సివిల్ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చట్టపరిధిలో పరిష్కారం అయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పరిష్కార వేదికకు 82 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

News November 25, 2025

ప్రకాశం జిల్లా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు.!

image

ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ జయ పార్ట్‌టైం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చీమకుర్తి బాలికల గురుకులాల్లో JL బోటనీ, మార్కాపురం బాలికల గురుకులాల్లో JL మ్యాథమెటిక్స్, కొండేపిలో TGT ఫిజికల్ సైన్స్ విభాగాలకు దరఖాస్తులు అందుకుంటున్నారు. డిసెంబర్ ఒకటిలోగా చీమకుర్తి గురుకులంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 2వతేదీ 11 AMకి చీమకుర్తి గురుకులంలో డెమో క్లాస్ ఉంటుందన్నారు.