News January 29, 2025
సిద్దిపేట: 100 శాతం పన్నులు వసూలు చేయాలి: అదనపు కలెక్టర్

సిద్దిపేట జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ టాక్స్, షాప్ రెంట్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయలన్నారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Similar News
News February 16, 2025
కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్ఠంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.
News February 16, 2025
పల్నాడు: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

రాజుపాలెం (మ) నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దృశ్యాలు అక్కడి వారందరిని కలిచి వేశాయి
News February 16, 2025
తూ. గో: ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 4, 286 మంది హాజరు

తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ భాగంగా శనివారం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ విభాగాలలో 2,439 మందికి 2,378మంది హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్ లో 1940 మందికి 1908 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ ఐ ఓ పేర్కొన్నారు.