News April 17, 2025
సిద్దిపేట: ‘1100 ఏళ్ల నాటి జైన విగ్రహాన్ని కాపాడుకోవాలి’

నంగునూరు మండలం చిన్నకొండ పైన ఉన్న జైన విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్,సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా పేరు ఉన్న జైన విగ్రహాన్ని బుధవారం ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు.1100 సంవత్సరాల చరిత్ర గల జైన విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక కేంద్రం చేయాలన్నారు.
Similar News
News December 16, 2025
IPL.. పతిరణకు రూ.18 కోట్లు

శ్రీలంక యంగ్ బౌలర్ మతీశా పతిరణను రూ.18 కోట్లకు KKR కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం పతిరణ స్పెషల్. ఇతడు గతంలో చెన్నై తరఫున ఆడారు. సౌతాఫ్రికా బౌలర్ నోర్జ్‌ను లక్నో రూ.2 కోట్లకు దక్కించుకుంది. అటు భారత స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
News December 16, 2025
గుంటూరు యార్డులో ‘ఘాటు’.. ఎల్లో మిర్చి @ రూ.280

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 60 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్‌లో ఎల్లో రకం మిర్చి రికార్డు స్థాయిలో కిలో రూ.200 నుంచి రూ.280 పలికింది. ముఖ్యంగా 2043 ఏసీ రకం గరిష్టంగా రూ.200, నాటు సూపర్-10 రూ.180, నంబర్-5 రూ.175 వరకు అమ్ముడయ్యాయి. ప్రధాన రకమైన తేజా ఏసీ రూ.120-149, 355 రకం రూ.170, బుల్లెట్ రూ.165 పలికాయి. మీడియం సీడు రకాలు రూ.90-110, తాలు రకాలు రూ.60-90 మధ్య ధర పలికాయి.
News December 16, 2025
మండపేట: వేగుళ్లకి తోట త్రిమూర్తులు సవాల్

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేవలం అవకాశవాది మాత్రమేనని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మన్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. మండపేట వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేది మేడిపండు నైజమని వ్యాఖ్యానించారు. ఆయనతో బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.


