News February 12, 2026
సిద్దిపేట: 17న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ

కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ నిర్వహణ బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. ఒక్కో బ్యాచ్‌లో సుమారు 100 మందికి ఐదు రోజుల నివాస శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణ హాల్, పరికరాలు, వసతి, భోజనం తదితర ఏర్పాట్లు సక్రమంగా చేయాలని, మహిళా సభ్యుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. శిక్షణ ఈనెల 17న ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News March 16, 2026
ADB: భట్టి పద్దు.. జిల్లా ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..?

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ADB జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ప్రాణహిత-చేవెళ్ల పనులకు భట్టి పద్దులో ప్రాధాన్యం దక్కుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు, పెద్దవాగు పూర్తికి నిధులు అవసరమున్నాయి. చనాక-కోరాట, పింపల్‌కాడ్, కుఫ్టీ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే సాగునీటి కల సాకారమవుతుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు.
News March 16, 2026
హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.
News March 16, 2026
కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.


