News February 28, 2025
సిద్దిపేట: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రులు 11.39శాతం, టీచర్ల ఓటింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News February 28, 2025
WNP: ‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మహిళా సాధికారత కేంద్రం వనపర్తి జిల్లా జెండర్ స్పెషలిస్టులు శ్రీవాణి, సలోమి అన్నారు. బేటి బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కొత్తకోటలోని ఓ కళాశాలలో ఫోక్సో యాక్ట్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు ఫోక్సో చట్టం అన్వాయిధం లాంటిదని, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
News February 28, 2025
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

పీఎం శ్రీ, సర్వ శిక్షా అభియాన్ పనులను మార్చి 20వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ టీజీడబ్ల్యూఈ ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యా, టీజీడబ్ల్యూఈ ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన నిధులు మంజూరు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. జిల్లాలో పీఎంశ్రీ 8 పాఠశాలలకు, సర్వ శిక్షా అభియాన్ 5 పాఠశాలలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు.
News February 28, 2025
బాపట్ల: ‘పెన్షన్‌దారులతో మర్యాదగా ఉండాలి’

పెన్షన్‌దారులతో మర్యాద పూర్వకంగా ఉండాలని, పెన్షన్ పంపిణీ సిబ్బంది కొత్త యాప్ డౌన్ లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. పెన్షన్ పంపిణీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించాలన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జిల్లా అధికారులతో కలిసి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్నారు.