News March 18, 2025

సిద్దిపేట: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

image

LRS రుసుముపై 25% తగ్గింపు రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం LRS రుసుముపై 25% తగ్గింపు రాయితీ ప్రకటించినట్లు తెలిపారు. కావున 2020 సంవత్సరంలో LRS కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాటు యజమానులు ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు.

Similar News

News April 18, 2025

భూమనపై కేసు నమోదు

image

TTD టీటీడీ గోశాలపై తిరుపతి మాజీ MLA భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన భూమనపై చర్యలు తీసుకోవాలని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఆయనపై SVU స్టేషన్‌లో కేసు నమోదు చేశామని CI రామయ్య వెల్లడించారు. మరి ఈ కేసులో భూమన అరెస్ట్ అవుతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది.

News April 18, 2025

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ పబ్లిక్ టాక్

image

కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలకపాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందంటున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన మూవీకి ప్లస్ పాయింట్ అని, అయితే స్టోరీ ఊహించేలా ఉందని పోస్టులు చేస్తున్నారు. కాసేపట్లో Way2News ఫుల్ రివ్యూ.

News April 18, 2025

కేసీఆర్ సెంటిమెంట్.. WGL, KNR మధ్యలో BRS సభ

image

KCR సెంటిమెంట్ జిల్లాలైన KNR, WGL జిల్లాల మధ్యలో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. 50వేలకు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో 169ఎకరాలు సభకు, మిగతాదంతా(1,331) పార్కింగ్‌కు కేటాయించారు. 300 LED స్క్రీన్లు, 15లక్షల మజ్జిగ, 15లక్షల వాటర్ ప్యాకెట్లు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

error: Content is protected !!