News February 26, 2026
సిద్దిపేట: 3,887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న(2,356 ఎకరాలు), సన్‌ఫ్లవర్(1,531 ఎకరాలు) పంటలు దెబ్బతిన్నాయి. తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.
Similar News
News April 19, 2026
ఉండవెల్లి: అన్నపై గొడ్డలితో తమ్ముడు దాడి..!

ఉండవెల్లి మండలంలో ప్రగటూరులో రక్తసంబంధం మంటగలిసింది. చిన్నపాటి వివాదాలు కాస్తా హత్యాయత్నానికి దారితీశాయి. శనివారం అన్నదమ్ముల మధ్య పాత గోడ కూల్చివేత విషయంలో జరిగిన గొడవలో తమ్ముడు శేఖర్ తన అన్న మల్లేష్‌పై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మల్లేష్ చేతికి తీవ్ర గాయమవ్వగా ఉండవెల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.
News April 19, 2026
IPLలో నేడు హోరాహోరీ పోరు

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్‌లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్‌లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
News April 19, 2026
భారత్‌తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.


