News April 1, 2025
సిద్దిపేట: 48 మంది ఈవ్‌టీజర్లపై కేసులు

48 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో గుర్తించిన 36 హాట్ స్పాట్స్ వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో 48 మంది ఈవ్ టీజర్లను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. మహిళలు మౌనం వీడి వేధింపులపై ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News April 10, 2025
మిర్యాలగూడ: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి పంచాయతీ కార్యదర్శి పెసర యాదగిరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా అధికారులు విచారణ చేశారు. ఓ వ్యక్తికి చెందిన నివాస గృహాల మ్యుటేషన్ విషయంలో రిజిస్టర్‌లో మార్పులు చేశారని రుజువు కావడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారు.
News April 10, 2025
నిర్మల్ : నేడు, రేపు సదరం క్యాంపు

నిర్మల్ జిల్లాలో ఈనెల 10, 11వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ డీఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్‌లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు ఫ్లాట్ బుకింగ్ రసీదు, ఆధార్ కార్డ్, సంబంధిత పత్రాలతో ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రికి రావాలన్నారు.
News April 10, 2025
ఎంపీ మేడాకు నోటీసులు

MP మేడా రఘునాథరెడ్డి, మాజీ MLA మేడా మల్లిఖార్జునరెడ్డిలకు JC రాజేంద్రన్ నోటీసులు జారీ చేశారు. వీరు నందలూరు (M) లేబాకలో పేదల పేరుతో అక్రమంగా దాదాపు 109 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణల కారణంగా నోటీసులు ఇచ్చారు. దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని JC హెచ్చరించారు.