News November 28, 2024
సిద్దిపేట: 6,213 ప్రభుత్వ పాఠశాలలు మూత..?: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 6,213 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే దుస్థితి నెలకొందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు ఉన్న విద్యార్థుల పాఠశాలలు 4,314, మొత్తం 6,213 స్కూళ్లను శాశ్వతంగా మూసేసే ప్రణాళికతో ఉన్నట్లున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆయా పాఠశాలల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.
Similar News
News November 30, 2025
ఎస్పీని సన్మానించిన బాధిత కుటుంబీకులు

మెదక్ పట్టణంలో పెళ్లిరోజు జరిగిన బంగారం చోరీని ఛేదించిన పోలీసులను అభినందిస్తూ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావును బాధితులు సన్మానించారు. పెళ్లిరోజు పది తులాల బంగారం చోరీకి గురికాగా, సీఐ మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి కోర్టు ద్వారా బంగారు ఆభరణాలు అందజేశారు. బాధిత కుటుంబం ఎస్పీని కలిసి శాలువాతో సన్మానించింది.

మెదక్: ‘నిర్భయంగా బయటకు రండి’

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తాయని మెదక్ ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. వేధింపులకు గురవుతున్నవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మెదక్ డివిజన్లో 5 ఎఫ్ఐఆర్లు, 8 ఈ-పిట్టి కేసులు, తూప్రాన్ డివిజన్లో 3 ఎఫ్ఐఆర్లు, ఈ-పిట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.