News February 1, 2025
సిద్దిపేట: 83 మంది పిల్లలకు విముక్తి: సీపీ

ఆపరేషన్ స్మైల్-XIలో 83 మందిని పిల్లలను రక్షించి తల్లిదండ్రులకు, బంధువులకు అప్పగించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. బాల కార్మికులతో పని చేయించుకుంటున్న యజమానులపై 17 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ముఖ్యంగా బడి ఈడు పిల్లలు బడులలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
Similar News
News October 23, 2025
తంగళ్ళపల్లి: 3 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

తండ్రి, కొడుకు మృతి చెందడంతో తంగళ్ళపల్లిలో విషాదం నెలకొంది. మంగళవారం తండ్రి మెరుపుల పర్షరాములు(70) మృతిచెందగా, గురువారం కొడుకు శ్రీనివాస్(45) అనారోగ్యంతో కన్నుమూశాడు. గల్ఫ్ నుంచి
తిరిగి వచ్చిన శ్రీనివాస్ కులవృత్తి చేసుకుంటు జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ వరుస ఘటనలతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
News October 23, 2025
ADB: అవినీతి చెక్ పోస్టులే నకిలీలను సరిహద్దు దాటించాయా..?

అవినీతి జరుగుతోందని చెక్పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లు, కేబుల్ వైర్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇవి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అయినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వస్తువులను చెక్పోస్టుల సిబ్బందికి మామూళ్లు ఇచ్చి సరిహద్దు దాటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మీ కామెంట్..?
News October 23, 2025
HYD: ఇద్దరు పిల్లలు మృతి.. తల్లడిల్లిన తల్లి

హైదరాబాద్ శివారులోని సాగర్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం తమ్మలోనిగూడ గేటు వద్ద ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రికి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లలు అభిరామ్(9), రామ(5) అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగులో ఉన్న పిల్లలను చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.