News March 6, 2025

సిద్దిపేట: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

Similar News

News September 14, 2025

జగిత్యాలలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్

image

జగిత్యాల ఐఎంఏ హాల్‌లో గైనకాలజీ అసోసియేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్ ఈ సందర్భంగా పలువురు మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి మహిళ ఈ టీకా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ఈ టీకా ఎంతో ముఖ్యమని తెలిపారు.

News September 14, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 14, 2025

మండవల్లి: యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడికి రిమాండ్

image

మండవల్లిలోని లోకుమూడికి చెందిన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కైకలూరు మండలం దానగూడేనికి చెందిన భరత్ కుమార్(21)పై కేసు నమోదు చేసినట్లు SI రామచంద్రరావు శనివారం తెలిపారు. ఈ నెల 12న సాయంత్రం యువతి ఇంటికి వెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆమె కేకలు వేయడంతో అడ్డువచ్చిన తల్లిదండ్రులపై కూడా దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసి కోర్టుకు తరలించగా..14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.