News February 14, 2025
సిద్దిపేట: MLC బరిలో 71 మంది..

ఉమ్మడి MDK, KNR, NZB, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో 71 మంది నిలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
Similar News
News October 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 28, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 7.00 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 28, 2025
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు


