News March 13, 2025
సిద్దిపేట: NREGS పనులను నెలాఖరుకు పూర్తి చేయాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులను ఈ నెల చివరికల్లా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో పంచాయతీ రాజ్ శాఖ చేపడుతున్న పనులపైన పంచాయతీ రాజ్, డీఆర్డీఓ శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి సమీక్షా నిర్వహించారు.
Similar News
News November 19, 2025
పుట్టపర్తిలో ఐశ్వర్యారాయ్

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. అబ్బీ వి, అంతరా నంది ‘సత్యం శివం సుందరం’తో సహా పలు భక్తి గీతాలను ఆలాపించి భక్తుల్ని మైమరపింపజేశారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, గాయకుడు హరిహరన్, డ్రమ్స్ శివమణి, మాజీ సీజేఐ NV రమణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
News November 19, 2025
సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.
News November 19, 2025
మూవీ ముచ్చట్లు

*రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ విడులైంది.
*‘బాహుబలి ది ఎపిక్’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 12న విడుదల చేస్తారని, 5న ప్రీమియర్‌కు ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరవుతారని తెలుస్తోంది.
*ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా భారీగా ఉండబోతోంది: మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్


