News March 13, 2025
సిద్దిపేట: NREGS పనులను నెలాఖరుకు పూర్తి చేయాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులను ఈ నెల చివరికల్లా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో పంచాయతీ రాజ్ శాఖ చేపడుతున్న పనులపైన పంచాయతీ రాజ్, డీఆర్డీఓ శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి సమీక్షా నిర్వహించారు.
Similar News
News March 22, 2025
సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపాథ్యంలో సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈనెల 28 నుంచి జరిగే జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. జాతర నిర్వహణలో ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి శాఖకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
News March 22, 2025
శుభ ముహూర్తం (22-03-2025)

☛ తిథి: బహుళ అష్టమి రా.12.34 వరకు తదుపరి నవమి ☛ నక్షత్రం: మూల రా.11.38 వరకు తదుపరి పూర్వాషాడ☛ శుభ సమయం: లేదు ☛ రాహుకాలం: ఉ.9.నుంచి 10.30 వరకు ☛ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు ☛ వర్జ్యం: ఉ.6.25 నుంచి 8.07 వరకు రా.9.55 నుంచి 11.37 వరకు ☛ అమృత ఘడియలు: సా.4.45 నుంచి 6.27వరకు
News March 22, 2025
జీవీఎంసీలో 101 అంశాలకు ఆమోదం

జివిఎంసి స్థాయి సంఘం సమావేశం శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశంలో 104 అంశాలు పొందుపరిచారు. వాటిలో ఒక అంశాన్ని వాయిదా వేశారు. 2 అంశాలను సభ్యులు తిరష్కరించారు. మిగిలిన 101 అంశాలు ఆమోదం పొందాయి. సమావేశంలో కార్యదర్శి బి.వి.రమణ, జోనల్ కమిషనర్లు ప్రేమ ప్రసన్నవాణి ,శివప్రసాద్, మల్లయ్య నాయుడు, బి.రాము ఉన్నారు.