News April 13, 2025
సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News October 7, 2025
‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు.
News October 7, 2025
సుజాతనగర్ జంక్షన్లో యాక్సిడెంట్.. మహిళ మృతి

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2025
విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు: జగన్

AP: విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ‘మనం మరో 5 ఏళ్లు కొనసాగుంటే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేవారు. మన విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు’ అని విమర్శించారు. ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వడం లేదని, పిల్లలు చదువులు మానేస్తున్నారని చెప్పారు. రైతులనూ నిండా ముంచారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోగా ఎరువులు రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు.