News April 13, 2025

సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.

Similar News

News July 8, 2025

GREAT: 67 ప్రాణాలు కాపాడిన కుక్క..!

image

హిమాచల్ ప్రదేశ్‌ వరదల్లో ఓ కుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది. గత నెల 30న అర్ధరాత్రి మండి జిల్లా సియాథిలో ఓ కుక్క అరుపులు విని గ్రామస్థుడు నరేంద్ర నిద్ర లేచాడు. ఆ సమయంలో ఇంట్లోని గోడకు పగుళ్లు, నీరు లీక్ కావడం గమనించి గ్రామస్థులందరినీ అప్రమత్తం చేశాడు. వారు వెంటనే గ్రామాన్ని విడిచారు. కాసేపట్లోనే కొండచరియలు విరిగిపడి ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. కుక్క అరుపు వల్ల 20 కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి.

News July 8, 2025

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News July 8, 2025

HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్‌ తొలగింపు.!

image

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.