News January 23, 2025
సిద్దిపేట: WOW.. రెండు కళ్లు సరిపోవట్లే !

పచ్చని పొలాలు, పల్లెటూరి అందాలు సాధారణంగా ఎవరినైనా కట్టిపడేస్తాయి. అయితే సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అప్పాయిపల్లిలో ఓ దృశ్యం మాత్రం అంతకుమించి ఉంది. వరి నాటు కూలీలు తమ పనిలో నిమగ్నవగా సమీపంలో ఓ రైలు వెళుతున్న సీనరీ చూపరులను కట్టిపడేస్తుంది. వారి ఛాయ నారు మడిలో పడుతుండగా ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్లు సరిపోవు అన్నట్లు ఆ ఫోటో ఉంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Similar News
News December 7, 2025
విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన లెక్చరర్

శ్రీకాళహస్తిలోని రిపబ్లిక్ క్లబ్ వద్ద గల ఓ ప్రైవేట్ కళాశాల తెలుగు లెక్చరర్ విద్యార్థినిని వాతలు పడేటట్లు కొట్టాడు. స్థానిక గోపాలవనం వద్ద నివాసం ఉంటున్న అనీస్ అనే విద్యార్థి శనివారం కళాశాలకు వెళ్లాడు. అక్కడ తెలుగు లెక్చరర్ విద్యార్థి పేరాగ్రాఫర్ రాయలేదని బెత్తంతో వాతలు పడేటట్లు కొట్టాడు. కళాశాల యజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
News December 7, 2025
ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
News December 7, 2025
KMR: గుర్తులొచ్చేశాయ్.. ఇక ప్రచారమే లక్ష్యం!

కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం శనివారంతో ముగిసింది. పలు మండలాల్లో పోటీ నుంచి పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. దీంతో ఎన్నికల వేడి జిల్లాలో మరింత రాజుకుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార రంగంలోకి దిగారు.


