News October 26, 2024
సిద్దేశ్వరాలయంలో శనీశ్వరునికి ప్రత్యేక పూజలు
హనుమకొండలో ప్రసిద్ధి పొందిన సిద్దేశ్వర ఆలయంలో శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సిద్దేశ్వరుని రవికుమార్ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. శనివారం సందర్భంగా నగరంలోని భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
Similar News
News November 14, 2024
పిల్లల ఈ దేశ భవిష్యత్తు అని గట్టిగా నమ్మారు: మంత్రి కొండా
భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని.. దేశానికి వారు అందించిన సేవలను, త్యాగాలను మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు అని గట్టిగా నమ్మిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని మంత్రి అన్నారు. పిల్లలకు సరైన విద్య, శిక్షణ, సంరక్షణ ఉంటే వారు దేశానికి మూలస్తంభాలుగా నిలుస్తారని భావించి ఆ దిశగా కార్యాచరణను అమలుచేసిన దార్శనికుడు నెహ్రూ అని మంత్రి తెలిపారు.
News November 13, 2024
12.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసాం: సీఎస్
HYD నుంచి సీఎస్ శాంతి కుమారి నేడు ధాన్యం కొనుగోలు, పత్తి పంట కొనుగోలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, గ్రూప్-3 పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై HNK జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 7.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామని, మరో 5.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని అధికారులన్నారు.
News November 13, 2024
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క.
రాష్ట్రంలోని పిల్లలకు మంత్రి సీతక్క బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డా ఆనందంగా ఉండాలనే నెహ్రూ ఆకాంక్ష రూపమే బాలల దినోత్సవమని పేర్కొన్నారు. దేశాన్ని వెనకబాటుతనం నుంచి వికాసం వైపు నడిపించిన దార్శనికుడిగా నెహ్రూను చిరకాలం ప్రజలు గుర్తు పెట్టుకుంటారని, నెహ్రూ చలవతోనే ప్రపంచ పటంలో దేశానికి ప్రత్యేక స్థానం దక్కిందన్నారు.