News October 29, 2024
సిద్ధవటం పెన్నా నదిలో యువతి గల్లంతు
సిద్ధవటం పెన్నా నదిలో ఎగువ పేట దళిత వాడకు చెందిన సునీత (19) గల్లంతైనట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం నదిలోకి దిగిన యువతి ప్రవాహ వేగంలో కొట్టుకుపోయిందన్నారు. దీంతో పోలీసులు పెన్నా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని యువతి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News October 29, 2024
పెద్దముడియం: కూతురిపై తండ్రి లైంగిక దాడి
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం పెద్దముడియంలో జరిగింది. నెమళ్లదిన్నె గ్రామానికి చెందిన మతిస్తిమితం లేని ఓ బాలికపై మద్యానికి బానిసైన తండ్రి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 29, 2024
కమలాపురం: పెళ్లి వేడుకలో విషాదం.. ఇద్దరు మృతి
పెళ్లి వేడుకకు పచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపురం మండలం నల్లింగాయపల్లెకి ఓ వ్యక్తి మల్లుపెల్లికి వచ్చాడు. సోమవారం రాత్రి భారతి సిమెంట్ కంపెపీ సమీపంలో నడిచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు ఆసుపత్రిలో మృతి చెందాడు.
News October 29, 2024
వేంపల్లి వద్ద బాంబు స్క్వాడ్ వాహనానికి ప్రమాదం
కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె వద్ద బాంబు స్క్వాడ్ వాహనానికి ప్రమాదం తప్పింది. జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందులకు వెళ్తున్న బాంబు స్క్వాడ్ వాహనాన్ని మంగళవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. దీంతో వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. వాహనంలో 10 మంది బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.