News March 6, 2025

సిద్ధాంతం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సిద్ధాంతం అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధాంతం చెరువుపేటకు చెందిన పమ్మి చినబాబు (30)మృతి చెందాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టాడంతో తలకు బలమైన గాయం అవ్వగా ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Similar News

News February 7, 2026

ఈనెల 9న ‘పీజీఆర్‌ఎస్‌’ రద్దు: కలెక్టర్‌

image

జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో ఈనెల 9 సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న వర్చువల్‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు జిల్లా స్థాయి అధికారులు హాజరుకావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, అర్జీదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆమె కోరారు.

News February 7, 2026

ఉండి: కాలువలో కుళ్లిన మృతదేహం

image

ఉండి మండలం చెరుకువాడ పంట కాలువలో శనివారం ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని, శరీరంపై కేవలం నీలిరంగు లుంగీ మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని ఉండి SI నసీరుల్లా పేర్కొన్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 6, 2026

రేపు రైస్ మిల్లర్లకు ఎంఎస్‌ఎంఈపై అవగాహన: కలెక్టర్

image

పెదమిరంలోని నిర్మల ఫంక్షన్ హాల్‌లో శనివారం ఈనెల 7 ఎంఎస్‌ఎంఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యజమానులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, యువ నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.