News April 4, 2025

సిద్ధిపేట జిల్లాలో వర్ష బీభత్సం

image

సిద్ధిపేట జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. మరో 10 రోజుల్లో చేతికివస్తాయనకున్న వరి, మొక్కజోన్న, ఉల్లి పంటలు గురువారం కురిసిన వర్షానికి నేలవాలాయి. పలు మండలాల్లో మామిడి తోటలు సైతం దెబ్బతిన్నాయి. వర్షం, ఈదురు గాలులతో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Similar News

News April 5, 2025

MBNR: PU నివేదిక ఇవ్వండి: CM 

image

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాల‌ని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ జి.ఎన్‌.శ్రీ‌నివాస్‌ పాల్గొన్నారు. అవ‌స‌ర‌మైన నిధుల, భ‌వ‌నాల నియామ‌కాలపై నివేదిక ఇవ్వాలన్నారు.

News April 5, 2025

రజనీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం: అడ్వకేట్ జనరల్

image

స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజనీ, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజనీ తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.

News April 5, 2025

అంబాజీపేట: అన్న కర్మకాండ రోజునే తమ్ముళ్లు మృతి

image

అంబాజీపేట మండలం గంగలకుర్రులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గత నెల 24న సూర్యనారాయణమూర్తి మృతి చెందగా అతని సోదరులు నాగరాజు, రామచంద్రరావు దిన కార్యం నిర్వహించారు. గోదావరిలో నదికి స్నానానికి బైకుపై వెళ్తుండగా వారిని టిప్పర్‌ ఢీకొట్టింది. అన్న దినకార్యం రోజునే ఇద్దరు సోదరులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

error: Content is protected !!