News March 10, 2025

సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫొటోస్ వైరల్

image

ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవిత చరిత్రపై సినిమా రానుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కనిపించిన జగ్గారెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జగ్గారెడ్డి ‘ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రూపకల్పన జరుగుతుందన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. జగ్గారెడ్డి చరిత్రపై సినిమా రానుడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో రానుంది.

Similar News

News March 11, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు అవార్డు

image

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయం ఈ అవార్డుకు ఎంపికైంది. 2024కు గానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులకు రాకపోకలు అందించి బెస్ట్ విమానాశ్రయంగా నిలిచింది. విమానాశ్రయ పరిణామం, సిబ్బంది తీరు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

News March 11, 2025

సంగారెడ్డి: 31 వరకు చివరి అవకాశం: కలెక్టర్

image

పట్టణాలు, గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఈనెల 31వ తేదీ వరకు 25% రాయితీ ఉందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

News March 11, 2025

నటితో గిల్ డేటింగ్?

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, టీవీ నటి అవ్‌నీత్ కౌర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌కు ఆమె హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో గిల్, అవ్‌నీత్ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అవ్‌నీత్ కౌర్‌ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

error: Content is protected !!