News March 10, 2025

సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫొటోస్ వైరల్

image

ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవిత చరిత్రపై సినిమా రానుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కనిపించిన జగ్గారెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జగ్గారెడ్డి ‘ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రూపకల్పన జరుగుతుందన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. జగ్గారెడ్డి చరిత్రపై సినిమా రానుడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో రానుంది.

Similar News

News March 17, 2026

ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

image

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు GHMC ఇటీవల ప్రకటించింది. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.

News March 17, 2026

సాగర్ ఎడమ కాల్వలో మిర్యాలగూడ యువకుడి గల్లంతు

image

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగెల్లి తరుణ్ (22) బొక్కమంతులపాడు శివారులో సాగర్ ఎడమ కాల్వలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టలు ఉతకడానికి వచ్చిన అతడు సోమవారం సాయంత్రం ఈత కొడుతుండగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయినట్లు తెలిపారు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అన్న మణిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 17, 2026

చిన్నగంజాం: మహిళపై హత్యాయత్నం?

image

వివాహేతర సంబంధం కారణంగా రామన్నపేటకు చెందిన ఓ మహిళపై మోటుపల్లిలో సోమవారం హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుప్రక్కల వారు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చిన్నగంజాం SI ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.