News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

Similar News

News October 28, 2025

చిత్తూరు: విద్యుత్ ఉద్యోగులకు సెలవులు లేవు

image

మొంథా తుఫాన్ కారణంగా చిత్తూరు డివిజన్ లో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈఈ మునిచంద్ర సిబ్బందిని అదేశించారు. మరో రెండు రోజుల పాటు సెలవులు ఎవరికీ ఇవ్వడం జరగదని, సెలవుల్లో ఉన్నవారు కూడా విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News October 28, 2025

హెయిర్ డై వాడే ముందు ఇవి తెలుసుకోండి

image

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్​ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.

News October 28, 2025

తుఫాను షెల్టర్లకు 534 మంది: మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో తుఫాను సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని 27 సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొంథా తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. 408 గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.