News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

Similar News

News December 7, 2025

సిద్దిపేట: ఇద్దరు భార్యల నామినేషన్.. పెద్ద భార్య సర్పంచ్

image

అక్బర్‌పేట భూంపల్లి మండలం జంగాపల్లి సర్పంచ్‌ పదవికి నరసింహారెడ్డి ఇద్దరు భార్యలు లావణ్య, రజిత నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు. కాగా చెల్లి రజిత శనివారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో అక్క లావణ్య సర్పంచ్‌గా ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్‌తో పాటు 10 వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి.

News December 7, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వో

image

స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర పిలుపునిచ్చారు. అమలాపురం ఈడబ్ల్యూఎస్ కాలనీలో అవగాహన సదస్సు జరిగింది. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. గడ్డి, పొదల్లోకి వెళ్లేటప్పుడు శరీరం కప్పుకునే దుస్తులు ధరించాలని, నేలపై నేరుగా కూర్చోవడం లేదా పడుకోవడం వంటివి చేయకూడదని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నివారణ సాధ్యమన్నారు.

News December 7, 2025

కొడాలి నాని గురించి ప్రశ్న.. వదిలిపెట్టనన్న లోకేశ్

image

AP: రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్‌లో తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు కొడాలి నాని గురించి అడగ్గా ‘నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.