News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

Similar News

News March 28, 2025

మిడ్ డే మీల్‌కు 1.14L టన్నుల సన్న బియ్యం: నాదెండ్ల

image

AP: ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సివిల్ సప్లైస్ 227వ బోర్డ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో 5.61L మంది రైతుల నుంచి 35.48L టన్నులను కొని, వారి ఖాతాల్లో రూ.8,138Cr జమ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి 1.14L టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. ప్రైవేటు గిడ్డంగులను గ్రీన్‌హౌస్ గిడ్డంగులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 28, 2025

ఉమ్మడి అనంత జిల్లాలో ఐదుగురికి నామినేటెడ్ పదవులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదుగురికి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. హిందూపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్‌గా అశ్వర్థ నారాయణరెడ్డి, కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవి, మడకశిర మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా గురుమూర్తి, గుంతకల్లు మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవికి అవకాశం లభించింది. ధర్మవరం మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా నాగరత్నమ్మ (బీజేపీ)ను నియమించారు.

News March 28, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు. 

error: Content is protected !!