News August 20, 2024
సినీ రంగంలో రాణిస్తోన్న మన సూర్యాపేట బిడ్డ
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెందిన అక్కినపల్లి రాములు, పూలమ్మ కుమారుడు అక్కినపల్లి సుధాకర్ సినీ రంగంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈయనది నిరుపేద కుటుంబం. జీవనోపాధి కోసం తల్లిదండ్రులతో పాటు HYD వెళ్లిన ఆయన చదువు మానేసి ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నారు. ముందు టీవీ ఛానళ్లలో అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేసి, 2019 నుంచి సినీరంగంలో పనిచేస్తున్నారు.
Similar News
News September 18, 2024
NLG: రోడ్డు ప్రమాదం.. మహిళా కానిస్టేబుల్ మృతి
సాగర్ సమీపంలో <<14133782>>రోడ్డుప్రమాదంలో<<>> చనిపోయిన మహిళను కానిస్టేబుల్ శ్రావణిగా గుర్తించారు. ఆమెది గద్వాల జిల్లా జోగులాంబ గ్రామం. కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే శ్రావణికి ఎంగేజ్మెంట్ అయింది. కాబోయే భర్త వద్దకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News September 18, 2024
దేవరకొండ: మైనారిటీ స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్
దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామపరిధిలో ప్రభుత్వ మైనార్టీ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు సమాచారం. నిన్న సాయంత్రం 6:00 గం.ల వరకు మిస్సింగ్ అయిన విద్యార్థుల ఆచూకీ కోసం స్కూల్ సిబ్బంది వెతికి ఫలితం లేకపోవడంతో.. స్కూల్ ప్రిన్సిపల్ దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News September 18, 2024
యాదగిరిగుట్ట: వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన ఏసీపీ
యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వినాయకుల నిమజ్జన కార్యక్రమాలను ఏసీపీ రమేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎరుకలి సుధా హేమేందర్ గౌడ్, సీఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.