News April 5, 2025
సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

నాగర్కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరసనగండ్ల గ్రామంలో నేటి నుంచి జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఐ శంషుద్దీన్, అగ్నిమాపక ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎవరైనా భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 9, 2025
రాజన్న ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం ఆదివారం సందర్భంగా భక్తులతో రాజన్న ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో రాజన్న సన్నిధిలో దీపాలను వెలిగించడం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.
News November 9, 2025
మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.
News November 9, 2025
విషాదం.. విద్యుదాఘాతంతో లైన్మన్ మృతి

ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెంలో విద్యుత్ పనులు చేస్తుండగా, కైకొండాయిగూడెంకు చెందిన లైన్మన్ టీ.గోపీ (26) శనివారం విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లైన్ క్లియర్ తీసుకున్నా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తన భర్త మరణించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


