News May 12, 2024
సిరా ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

కర్నూలు జిల్లాలో చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సృజన ఖండించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Similar News
News December 19, 2025
కర్నూలు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ABCD అవార్డు

ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ATM దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు కర్నూలు జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయి అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD) లభించింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అవార్డును అందుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీజీపీ అభినందించారు.
News December 19, 2025
చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్తారు: ఎస్వీ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఒక్క హామీ కూడా అమలు కాలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. లేకపోతే ప్రజలు మరొకసారి గుణపాఠం చెప్తారని అన్నారు. పేదల హక్కుల కోసం చివరి వరకు జగన్ పోరాడుతారని అన్నారు.
News December 19, 2025
సుపరిపాలన వారోత్సవాలు ప్రారంభం: కలెక్టర్

ఈ నెల 25 వరకు జిల్లాలో సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ‘గ్రామాల వైపు పరిపాలన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


