News December 3, 2024
సిరికొండ: పెళ్లి చేసుకుంటానని చెప్పి గల్ఫ్ పారిపోయాడు

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు గల్ఫ్ పారిపోయిన ఘటన సిరికొండలో చోటుచేసుకుంది. SI రామ్ వివరాల ప్రకారం.. ముషీర్‌నగర్‌కు చెందిన ఓ యువతి, అక్షిత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గతవారం గల్ఫ్‌కు పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు యువకుడికి సహకరించిన తల్లి మల్లవ్వ, అన్న అజయ్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News February 9, 2026
NZB: ఎలక్షన్ ఎఫెక్ట్.. 162 మంది బైండోవర్

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో 162 మందిని సంబంధిత తహశీల్దార్ల ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించిన వారిపై టౌన్-1, టౌన్-3, బోధన్, భీమ్‌గల్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
News February 9, 2026
NZB: 1,500 మంది సిబ్బందితో బందోబస్తు: సీపీ

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 3 ప్లాటున్ల TSSP సిబ్బంది , స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
News February 9, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్‌తో కలిసి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.


