News September 9, 2024
సిరికొండ: వినాయక మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో తాళ్లతండాలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. తండాలోని వినాయక మండపం వద్ద సంజీవ్(16) మైక్ సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
Similar News
News October 23, 2025
నిజామాబాద్‌లో ధాన్యం సేకరణ ఏర్పాట్లు భేష్: ఎండీ లక్ష్మి

ఖరీఫ్ వరి ధాన్యం సేకరణ కోసం నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లు అభినందనీయమని స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ (MD) లక్ష్మి (ఐఏఎస్) అన్నారు. బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆమె ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ, సొసైటీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లను ఆమె ప్రశంసించారు.
News October 22, 2025
NZB: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.
News October 22, 2025
కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.