News June 5, 2024
సిరిపురం జంక్షన్‌లో స్టాపర్లు తొలగించాలని నిరసన
విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్‌బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా..సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.
Similar News
News December 10, 2024
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.2.81కోట్లు
సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 39 రోజులకు గాను ఆలయ అధికారులు ఈఓ త్రినాథ్ రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.2,81,93,913 ఆదాయం వచ్చింది. బంగారం 126 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 140 గ్రాములు, 9దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
News December 9, 2024
విశాఖ డైరీకి పూర్వ వైభవం తెస్తాం: స్పెషల్ హౌస్ కమిటీ
విశాఖ డైరీ అక్రమాలపై ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస్ కమిటీ సోమవారం కలెక్టరేట్‌లో రివ్యూ జరిపింది. మేనేజంగ్ డైరెక్టర్ గారు కంపెనీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, త్రిప్ట్ సొసైటీ ద్వారా నిధుల మల్లింపు ఆరోపణలపైన కూడా వివరం కోరామని అన్నారు. రైతులకు న్యాయం చేసి రాజకీయాలకు అతీతంగా డెయిరీని అభివృద్ధి చేయడమే ఈ హౌసింగ్ కమిటీ లక్ష్యమని అన్నారు. అధికారులు సహకరిస్తే సాధ్యమని తెలిపారు.
News December 9, 2024
అల్లూరి జిల్లాలో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లిలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందారని ఎస్‌ఐ కే.రమణ తెలిపారు. గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మి(36), ఆమె కుమారుడు సంతోష్(13), కుమార్తె అంజలి(10) ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.