News October 11, 2024
సిరిపురం దేశాన్ని ఆకర్షిస్తుంది: డిప్యూటీ సీఎం

సోలార్ విద్యుత్ పనులు పూర్తైన తర్వాత సిరిపురం గ్రామం దేశాన్ని ఆకర్షిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో వ్యవసాయ పంపు సెట్లకు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమైందో చూసేందుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి మంత్రులు వస్తారని చెప్పారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం: కలెక్టర్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచి పోస్టులకు సంబంధించి ఫలితాలు నిబంధనల ప్రకారం ప్రకటించాలని కమిషనర్ పేర్కొన్నారు.
News December 4, 2025
ఖమ్మం: 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.లక్ష జరిమానా

గంజాయి రవాణా కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 22.150 కేజీల గంజాయితో పట్టుబడిన రాజస్థాన్‌కు చెందిన భాగ్ చంద్ బైర్వా (A1)కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉండటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
News December 4, 2025
ఖమ్మం: ఆహార శుద్ధి రంగంలో నిపుణుల కొరతపై ప్రశ్నించిన ఎంపీ

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఖమ్మం ఎంపీ రఘునాథరెడ్డి ప్రశ్నించారు. కేవలం మూడు శాతం కార్మికులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతిక వినియోగ వివరాలు తెలపాలని లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్ నిత్ సింగ్ బిట్టు లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.


