News October 11, 2024

సిరిపురం దేశాన్ని ఆకర్షిస్తుంది: డిప్యూటీ సీఎం

image

సోలార్ విద్యుత్ పనులు పూర్తైన తర్వాత సిరిపురం గ్రామం దేశాన్ని ఆకర్షిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో వ్యవసాయ పంపు సెట్లకు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమైందో చూసేందుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి మంత్రులు వస్తారని చెప్పారు.

Similar News

News November 9, 2024

ఈ నెల 13న అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదర్శన కోసం ఈ నెల 13 బుధవారం ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఖమ్మం నుంచి 64064, మధిర నుండి 66566, సత్తుపల్లి నుంచి 99599, భద్రాచలం నుంచి 55555 సర్వీస్ నంబర్స్ గల బస్సులు రాత్రి బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయన్నారు. సీట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in సంప్రదించాలని కోరారు.

News November 9, 2024

ఖమ్మం ట్రాఫిక్ కానిస్టేబుల్ పార్థసారథి మృతి

image

ఖమ్మం ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జాలాది పార్థసారథి శుక్రవారం అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2003 కానిస్టేబుల్ బ్యాచ్‌కి చెందిన పార్థసారథి సౌమ్యుడిగా పేరుపొందారు. పార్థసారథి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

News November 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు