News April 5, 2025
సిరిసినగండ్ల సీతారాముల కళ్యాణానికి ఆలయం ముస్తాబు..!

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన చారకొండ మండలం సిరిసినగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణానికి దేవాలయం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం తిలకించడానికి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
Similar News
News September 13, 2025
విశాఖ: లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారం

విశాఖ జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 124 మోటార్ ప్రమాద కేసులు పరిష్కరించారు. నష్టపరిహారం రూ.4,40,04750 అందజేశారు. 155 సివిల్ కేసులు, 10,190 క్రిమినల్ కేసులు, 239 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశారు. రాజీ మొత్తం రూ.25 కోట్లుగా చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు చిన్నంశెట్టి రాజు లోక్ అదాలత్ని పర్యవేక్షించారు.
News September 13, 2025
ఆంధ్ర క్రికెట్ హెడ్ కోచ్గా గ్యారీ స్టీడ్

ఆంధ్ర మెన్స్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ను ACA నియమించింది. ఈ నెల 20-25 తేదీల మధ్య ఆయన బాధ్యతలు చేపడతారని సమాచారం. కాగా గ్యారీ ఆధ్వర్యంలో కివీస్ 2019 WC ఫైనల్ చేరుకుంది. అలాగే 2021 WTC టైటిల్ సాధించింది. మరోవైపు ఆంధ్ర గత రంజీ సీజన్లో గ్రూప్-Bలో ఆరో స్థానంలో నిలిచింది. VHTలో గ్రూప్-Bలో నాలుగు, SMATలో ప్రీక్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.
News September 13, 2025
హనుమకొండ: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి

రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలోని రాంనగర్ నివాసంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.