News February 23, 2025

సిరిసిల్లలో ఉచిత చికెన్ మేళా.. ఎగబడిన జనం (VIDEO)

image

సిరిసిల్ల పట్టణంలో ఉచిత చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉచితంగా చికెన్, కోడిగుడ్లను తినేందుకు జనాలు అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది. బ్లడ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతం పడిపోయిన విషయం తెలిసిందే. కోళ్ల నుంచి బ్లడ్ ఫ్లూ మనుషులకు సోకదని వైద్యులు పలు ప్రకటనలు చేశారు. అపోహలు వదంతులను దూరం చేసేందుకు ఈ మేళా ఏర్పాటు చేశారు. 2వందల కిలోల చికెన్, 2వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు.

Similar News

News November 21, 2025

వంటగది చిట్కాలు

image

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.

News November 21, 2025

కాట్రేనికోన: కొబ్బరి చెట్టు పైనుంచి జారిపడి కార్మికుడి మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా దొంతికుర్రులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కర్రీ అప్పలరాజు (36) అనే వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా గోపాలపట్నం వాసిగా గుర్తించారు. కాట్రేనికోన మండలంలో తోటి కూలీలతో కలిసి దింపులు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వచ్చిన కార్మికుడు మృతి చెందడంతో తోటి కూలీల్లో విషాదం అలముకుంది.

News November 21, 2025

ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.