News March 23, 2024
సిరిసిల్లలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య!
సిరిసిల్లలో శుక్రవారం <<12902064>>మహిళ దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. CI రఘుపతి ప్రకారం.. వేములవాడ మండలానికి చెందిన రమ(41) భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. దీంతో రమ SRCLలో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే అనంతనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న బిహార్‌కు చెందిన ఇద్దరు 15 రోజుల క్రితం ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చారు. వారే అత్యాచారం చేసి పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Similar News
News September 10, 2024
కరీంనగర్: ఏరియా ఆసుపత్రులకు గుర్తింపు.. నిధులు కరవు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ఎన్క్వాస్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇక్కడి వైద్యులు ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తుండడంతో పాటు చక్కటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తింపు లభించింది. అయితే మంచి సేవలు అందిస్తున్నప్పటికీ ఈ ఆసుపత్రులకు నిధులు మాత్రం కరవయ్యాయి.
News September 10, 2024
కరీంనగర్: ఎమ్మెల్సీ పదవికి ఎత్తుగడలు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు బలమైన నాయకులను పోటీలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆశావహులు కూడా పోటీలో నిలబడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
News September 10, 2024
జగిత్యాల: విష జ్వరంతో విద్యార్థి మృతి
విష జ్వరంతో విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మపురి మండల కేంద్రంలో హనుమాన్ వీధికి చెందిన గజ్జల రామ్ చరణ్(10) 4వ తరగతి చదువుతున్నారు. వారం రోజులుగా జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆసుపత్రిలో వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.