News July 15, 2024
సిరిసిల్ల: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 తులాల బంగారు, 2 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, రెండు మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లొ నిందుతులపై 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. సంపత్, పరుశురాం అనే ఇద్దరిని రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 28, 2024
కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని ఇదివరకే ఎన్ టి పి సి, బసంత్,నగర్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని తద్వారా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.
News November 28, 2024
కరీంనగర్: ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ABVP నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
News November 28, 2024
పండగలు మీకు.. పస్తులు రైతులకా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనున్న రైతు పండగలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా మండిపడ్డారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్లలో ఆనందం చూసినందుకా? రైతును నిండా ముంచినందుకా? వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా? రైతు పండుగలు అని ప్రశ్నించారు. పండుగలు మీకు.. పస్తులు రైతులకా? అని విమర్శించారు.