News April 10, 2025
సిరిసిల్ల: అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన పండ నేల పాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Similar News
News November 17, 2025
యలమంచిలి ఎమ్మెల్యేపై పవన్ సీరియస్

అచ్యుతాపురం (M) దుప్పితూరు భూ వివాదంలో MLA జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పవన్కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్లొద్దని మంత్రి నాదెండ్ల ద్వారా విజయకుమార్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకుని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దని పవన్ సూచించినట్లు సమాచారం. MLA నుంచి వివరణ కూడా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
News November 17, 2025
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణం జరిగింది. గజ పటాన్ని స్వరకవచ ధ్వజస్తంభంపైకి ఎగురవేసి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. ముందుగా అమ్మవారి ఉత్సవర్లను ధ్వజస్తంభానికి అభిముఖంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బేడితాడనం, అష్టదిక్పాల కైంకర్య ఆస్థానం నిర్వహించారు.
News November 17, 2025
BRIC-THSTIలో ఉద్యోగాలు

BRIC-ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్& టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (<


