News March 10, 2025
సిరిసిల్ల: అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ చేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం సిరిసిల్ల జిల్లాలోని 46 మంది బాధితులకు రూ 36,87,500 లను వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 25, 2025
విశాఖ తీరంలో హీట్ పెంచుతున్న మేయర్ పీఠం ..!

విశాఖ తీరంలో GVMC మేయర్ పీఠం హీట్ పెంచుతోంది. మేయర్ పదవి దక్కించుకునేందుకు కూటమి కదుపుతున్న పావులను YCP తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకులు ఇటీవల కలెక్టర్‌కు వినతి ఇవ్వగా.. అలెర్ట్ అయిన వైసీపీ అధిష్ఠానం క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం. ఇప్పటికే 28 మంది YCP కార్పొరేటర్లను బెంగళూరు తరలించారు. అక్కడి నుంచి ఊటీ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
News March 25, 2025
నెల్లూరులో జాడే లేని అనిల్ కుమార్ యాదవ్.?

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి దూకుడు పెంచారు. వరుసగా కార్యకర్తలు, నేతలను కలుస్తూ వారికి అండగా ఉంటున్నారు. MLC చంద్రశేఖర్ రెడ్డి సైతం అటు శాసనమండలి, ఇటు బహిరంగంగా టీడీపీ నేతలను ఎండగడుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వంటి నేతలు మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News March 25, 2025
పవన్ కళ్యాణ్‌కు ఆ పేరు పెట్టింది నేనే: హుస్సేని

లుకేమియా కారణంగా <<15878066>>చనిపోయిన<<>> కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని ఆస్పత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి తరచుగా వచ్చేవాడు. ఆయన ఎంతో చురుగ్గా ఉండేవారు. నా ఫేవరెట్ స్టూడెంట్. కళ్యాణ్ కుమార్‌గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టాను. నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలి’ అని ఆయన కోరారు.